TAMA Rachabanda

TamaRachaBanda for Transparency, Accountability, Measurability and Accuracy

March 25, 2010

తెలంగాణా "కిట్కీల్ రెండువేల పది" (Windows2010)

2010 సంవత్సరమును తెలంగాణా ప్రజలు "ప్రత్యేక తెలంగాణా సంవత్సరము"గా జరుపుకుంటున్న శుభ సందర్భములో బిల్ గేట్స్ గారు తన మైక్రో సాఫ్ట్ విండోస్ ను తెలంగాణా భాషలో విడుదల చేస్తామని ప్రకటించారు దానికి మన "పులకేసి. ఆర్" గారు హర్షం వ్యక్తం చేసారు. (పులకేసి గారి ఇంటి పేరు ఆర్ , కనుక దానిని కలిపి చదువు కోవద్దు దయచేసి.)
ఆ విండోస్ పేరు "కిట్కీల్ రెండువేల పది" (Windows2010):

keywords :-
search = దేవులాడు
Save = బచాయించు
Save as = గిట్ల బచాయించు
Save All = అన్నీ బచాయించు
Help = నన్ను బచాయించు
Find = ఎత్కు
Find Again = మల్లా ఎత్కు
Move = సర్కాయించు
Zoom = పెద్దగ చెయ్
Zoom Out = శిన్నగాచేయ్
Open = తెరవే
Close = మూయ్
New = కొతది
Old = పాతది
Replace = మార్చేయి
Insert = నడిమిట్ల వెట్టు
space = జాగా
Backspace = ఎన్క జాగా
Run = ఉర్కు
Print = అచ్చు
Print Preview = చూసి అచ్చేయి
Copy = గట్లాంటిదే
Cut = కోయ్
Paste = అత్కియ్
Delete = తీసిపడెయ్
View = సూడు
Tools = ముట్లు
Toolbar = ముట్ల గోత్తం
Exit = ఇగవోరి
Compress = గుంజు
mouse = ఎల్క
click = వొత్తు
Double Click = మల్లా మల్లా వొత్తు
Forward = ఇడికేళ్ళి ఆడకి
Scrollbar = తిప్పుడు గోట్టం
Double Click with the left mouse button= ఎల్క చెవ్వు వొక మలి ఎడం దిక్కు మల్లా మల్లా వోత్తాలే

This program has performed an illegal operation *"Abort, Retry or Ignore" ? " = ఈ కార్యం దొంగలెక్కకు వట్టిది, జల్ది ఊర్కు లేకుంటే మల్లా కొట్టు లేక మర్శిపో

ACCESS = దొర్కవట్టు
FOXPRO = నక్కలేక్కల్ తురుమ్ఖాన్
Lotus Notes = తామర్పువ్ పైసల్
ACCESS DENIED = దొర్కవట్టనీయ్
Home = ఇంటికి వో
end = కొనాకి


Errors = నీ నోట్ల మన్ను వడ

No comments:

Search