ఇది ఒక వింత ప్రేమ కధ
అనగనగా ఒక అమ్మాయి.పేరు తెలంగాణతిలోత్తమ. నిజాం ఆమె మేనమామ. బలవంతంగా తన కొడుకు కి ఇచ్చి పెళ్ళి చేసాడు. ఇష్టం లేని పెళ్ళి. దానికి తోడు అనుమానాలు, అవమానాలు! బలవంతపు పెళ్ళి కి ప్రతిఫలం కొడుకు హైదర్. మనవడిని చాలా ప్రేమ గానే చూసుకునేవాడు నిజాం.తెలంగాణతిలోత్తమ రక్త స్వేదాలు కూడా పిండి, మనవడి ముద్దు ముచ్చటలు తీర్చే వాడు.తన ప్రాణాలు తోడే సేటంతగా మామ గారికి తన కొడుకు మీద అంత ప్రేమ అని ఆనందించాలో , లేక ఈ నరకం నుండీ బయట పడటానికి తన ప్రాణాలే తీసుకోవాలో తెలిసేది కాదు తెలంగాణతిలోత్తమ కి. ఎలా అయినా అక్కడ నుండి విముక్తి పొందాలని అనుకుంది.ఒక రోజు ఆమె బయటకి వచ్చేసింది.
ఆంధ్రా ఆనందం ఆ యువకుని పేరు. తమిళ తంబి కి సవతి తమ్ముడు. తనకి వ్యాపారం లో సరైన స్థానం ఇవ్వలేదు అని తమిళ తంబి తో తెగతెంపులు చేసుకుని బయటకి వచ్చేసాడు. ఒక కొత్త జీవితం మొదలు పెడదామని బయలుదేరిన అతడికి వూరి బయట శివాలయం ఎదురుగా తెలంగాణతిలోత్తమ కనిపించింది.ఒకరి కష్టాలకు ఒకరు ఓదార్పు చెప్పుకున్నారు. శివాలయం పూజారి వారిని భార్యాభర్తలగా పొరబడి దీవించాడు. ఆంధ్రాఆనందంకి కూడా అప్పటి వరకు లేని ఆలోచన కలిగింది, తెలంగాణతిలోత్తమని పెళ్ళి చెసుకుందామని! కాని అప్పటికే నిజాం కొడుకు తో విఫలమైన వివాహం వలన తెలంగాణతిలోత్తమ వెనుకంజ వేసింది. ఒంటరిగా వుండటమే తనకి ఇష్టం అంది. కాకపోతే కొంతసేపు ఆలోచించి కొన్ని షరతులు పెట్టింది. తన పుట్టినింటివారికి తోడ్పాటు అందులో ఒకటి. తన కొత్త వ్యాపారం లో తన వారికి భాగస్వామ్యం, ఇంకా తన వాళ్ళు తమ కాళ్ళ మీద నిలబడడానికి ఏమైతే అవసరం అవుతాయో అవన్ని కలిపించమని అడిగింది. ఆంధ్రాఆనందం ఒప్పుకున్నాడు ఆనందం గా?
కొత్త కాపురం కొన్నాళ్ళు వరకు బాగానే వుండేది. హైదర్ ని కూడా చాలా బాగా చూసుకునేవాడు. “హైటెక్” ఇంఫర్మేషన్ టెక్నాలజి చదివించాడు. అయితే పెళ్ళి కొత్తలో తెలంగాణతిలోత్తమ కి ఒకసారి ఆంధ్రాఆనందం మీద కోపం వచ్చింది. పుట్టినింటికి వెళ్ళిపోతాను అంది. కారణం: తన పుట్టినింటివారు ఇంకా వారి కాళ్ళ మీద నిలబడలేదు అని, అయినా ఆంధ్రాఆనందం తోడ్పాటు ఇవ్వడం ఆపేసాడు అని ఆమె ఆరోపణ. మరి ఆంధ్రాఆనందం చెప్పేదేమిటంటె ఇలాంటి తోడ్పాటు వారి క్షమతని తగ్గించివేస్తుంది, వారి బాగు కోసం, వారు సొంతంగా ఎదగాలని ఎవరి మీద ఆధారపడకూడదని తాను డబ్బు పంపడం మానేసాడు అని. కాని ఆమె మన్సులో ఒక అనుమానపు బీజం! నిజంగా తనని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడా? తన వాళ్ళ బాగు పట్టించుకునే వాడేనా? ఏమయితేనెమి? ఇద్దరు సద్దుమణిగి సంసారం సాగించారు. అయితే…….
నడి వయసు కి వచ్చిన వారిద్దరి సంసారం లో చిచ్చు పెట్టేటందుకు వచ్చిన విలన్ మాయల ఫకీరు ముక్కు చంద్రం. తెలంగాణతిలోత్తమ కి మేనమామ తరపు బందువు. ఆమెకి కూడా ముక్కు చంద్రం అంటే ఏ రోజు మంచి అభిప్రాయం లేదు. వాడు పరమ స్వార్ధపరుడు అని ఆమె కి తెలుసు. ఆమె కి ఆంధ్రాఅనందం మీద లేనిపోని అనుమానాలు రేకెత్తించేవాడు. వారు విడిపోతె ఆమె పంచన చేరి ఆమె సంపద కొల్లగొడదామని వాడి ప్లాను. శేఖరం అనే పెద తాత వున్నంత కాలం మాయల ఫకీరు ముక్కు చంద్రం మంత్రాలు పారలేదు.కాని శేఖరం తాత మేడ మీద నుండి పడిపోయి చనిపొయాడు.
శేఖరం తాత చనిపొయాక ఆంధ్రాఆనందం ఇంట బయట పరిస్థితులు చాలా మారిపోయాయి. కలత చెందిన అతడు కొంచెం ముభావం గా వుండేవాడు. ఇదే అదను గా ముక్కు చంద్రం కుట్ర పన్నాడు.తెలంగాణతిలోత్తమ మన్సు విరిచేసాడు. తెలంగాణతిలోత్తమ పిన్ని పిల్లల్ని సివిల్స్ చదివించినా, ఆంధ్రాఆనందం తరపు వాళ్ళకి చదివించిన ఇంజనీరింగ్ మాత్రమే గొప్పని వూదరగొట్టెవాడు ముక్కు చంద్రం. సంపాదించినదంతా వాళ్ళ చుట్టాలకే పెడుతున్నాడని బాదపడెవాడు.మన జాతి ఏంటి ,కులం ఏంటి? వాళ్ళ జాతి కులం ఏంటి అని విభేదాలు కలిపించేవాడు. నీ నగలు నట్రా అంతా అమ్మి ఇంత వ్యాపారం పెంచగలిగాడని అబద్దాల తో చెవి తినేవాడు.
అవును నిజమే! వ్యవసాయానికి అనువు కాని చోట ఎవరు పొలం దున్నరుగద!తన వాళ్ళకి మట్టి పిసకడమె వచ్చు. అందుకె వాళ్ళకి పొలాలు, సాగు నీటి సాయం చేసాడు. లెక్కలు వచ్చు కనుక ఇంజినీరింగ్ చదివించాడు.అలాగే తెలంగాణతిలోత్తమ చుట్టాల పిల్లలికి సివిల్స్ కోచింగ్ ఇప్పించాడు.ఆంధ్రాఆనందం ఆమె తరపు వాళ్ళని తన వాళ్ళగా భావించి చేపల చెరువులు కట్టించి ఇచ్చాడు.
కాని మాయల ఫకీరు ముక్కు చంద్రం మంత్రాలు పని చెసాయి.తెలంగాణతిలోత్తమ కి ఇప్పుడు ఆంధ్రాఆనందం మీద నమ్మకం లెదు.విడిపోదాము అనుకుంటుంది. కొడుకుగా హైదర్ మీద పూర్తి హక్కు తనదే అంటుంది!వారి సంసారం లో చోటు చేసుకున్న అపోహలు దూరం చెయ్యగలరా ఎవరైనా? మీరేమైనా ఆమె కి సలహా ఇవ్వగలరా?…………
March 6, 2010
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
Bongu Kadhu
Post a Comment