TAMA Rachabanda

TamaRachaBanda for Transparency, Accountability, Measurability and Accuracy

March 25, 2010

రాష్ట్రాన్ని అయిదు ముక్కలు చెయ్యాల్సిందే !!

ఖచ్చితంగా అయిదు ముక్కలు చేయాలి
౧. తెలంగాణా
౨.అనంతపురం ని కర్ణాటక లో కలపాలి
౩.రాయల సీమ
౪.ఉత్తరాంధ్ర
౫. ఆంధ్ర

మొదటగా ఉత్తరాంద్ర :-
ఉత్తరాంధ్ర వెనక పడిన ప్రాంతం. అక్కడ నిరక్ష్య రాస్యత ఎక్కువ, అక్కడ వనరులు తక్కువ
విశాఖ పట్నం తక్క అన్నీ ప్రాంతాలు వెనక పడినవే
అలాంటి వెనక పడిన ప్రాంతాలని దత్తత తీసుకుని మరోసారి మోసపోవడానికి ఆంధ్ర ప్రజలు అమాయకులు కారు.
కనుక వెనుక పడిన ప్రాంతాలని వదిలి వెయ్యాలి.
అంటే కాకుండా అధికార వికేంద్రీకరణ జరగాలి
వాళ్ళను కూడా వారి ప్రాంతాలను వారిని పరిపాలించుకోనివ్వాలి.
తెలంగాణా ప్రజలకు మలనే వారు కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించాలి.

అనంతపురం :-
అక్కడ స్తానికులు అందరూ కన్నడం లో మాట్లాడతారు కానీ స్కూల్ లో మాత్రం తెలుగు లో భోదిస్తారు
అనంతపురాన్ని కర్ణాటకలో కలపడం మంచిదే.
ఆ గొడవ ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా రాధాంతం అవుతుంది

రాయల సీమ : -
ప్రత్యేక తెలంగాణా వచ్చిన తర్వాత రాయల సీమ మరియు కోస్తా కలిసి ఉంటె రాజధాని సమస్యలు ఏర్పడతాయి
కర్నూలు ని రాజధాని గా చేస్తే ఆంధ్రా ప్రజలు నష్టపోతారు ( హైదరాబాదు ని రాజధానిగా చేసుకుని ఎలా నష్ట పోయారో అలా )
అదే గుంటూరు ని రాజధానిగా చేస్తే రాయల సీమ ప్రజలు మోసపోతారు
అందుకని రాయల సీమని ప్రతేక రాష్ట్రం గా చెయ్యాలి

తెలంగాణా :-
తెలంగాణా ని ప్రత్యేక రాష్ట్రం గా చెయ్యాలని తెలంగాణా ప్రజల కన్నా నేనే ఎక్కువ గా కోరుకుంటున్నాను. ఇటలీ దేవత జన్మదిన కానుకగా చిదంబరం చేసిన అర్ధ రాత్రి ప్రకటనతో మా ప్రాంతం లో లక్ష రూపాయలు పలికే స్తలం పది లక్షలు అయి పోయింది రాత్రికి రాత్రే :)
మా ఆస్తులు పదింతలు పెరిగాయి ఒక్కసారిగా
ఆ లక్ష రూపాయల ఆస్తి కోటి రూపాయలు కావాలంటే ప్రత్యేక తెలంగాణా రావాల్సిందే
మరి మేము కూడా కోటీస్వరులము కావాలిగా మరి

ఆంధ్రా :-
వెనక పడిన ప్రాంతాలతో మాకేమిటి పని. అందుకే ప్రత్యేక ఆంధ్రా
అంటే ఆంధ్ర లో వెనక పడిన ప్రాంతాలు లేవని కాదు.
ఇక్కడ చదువరులు ఎక్కువ, కరెంటు బిల్లులు చెల్లిస్తారు. విద్యుత్తు చౌర్యం తక్కువ
ఇంకా డెల్టా ప్రాంతం
కృష గోదావరి నదులు సముద్రం లో కలిసే చోటు వ్యవసాయానికి అనుకూలం

ఈ పైన చెప్పిన వన్నీ పిచ్చి పిచ్చి లాజిక్కులు అని అనుకోకూడదు

అమ్మవారు మరికేమీ ఆలోచించకుండా అయిదు ముక్కలు చెయ్యాలి
అయిదు ముక్కలు చేయడానికి అయిదు నిమషాలు చాలు మన కెసిఆర్ అన్నట్లుగా

విభజించి పాలించు ధోరణి ప్రకారం ముక్కలు చెక్కలు చేయాల్సిందే

సమైక్యంద్ర ధోరణి అనవసరం

ఎంత కాలం ఈ సమైక్యం . మనం చిన్నగా ఉన్నప్పుడు తండ్రి చాటు ఉంటాం. కొంతకాలం అయిన తర్వాత పెళ్ళాం వచ్చిన తర్వాత కూడా తండ్రి చాటు ఉంటామా ?

సమైక్యం గా ఉందాం అని చెప్పి ,వేరెవరితోనో మమ్మల్ని దోచుకున్నారు అని నిందలు పడటం ఎందుకు ?
ఎంతకాలం హైదరాబాదు ని ఉద్దరిస్తాం. పెట్టుబడులన్నీ ఇక్కడే పెడితే ఎలా ?, ఉన్నవి చాలక మెట్రో రైల్ అట
హైదరాబదు నే అభివృద్ధి చేసుకుంటూ పొతే ఎలా ?
ఇక్కేడేనా ఫ్లై ఓవర్ లు , మా ప్రాంతాలకు వద్దా ?
మా ప్రాంతాలను అభివృద్ధి చేయరా ?

మన పక్కింటోడు కరెంటు బిల్లు ఎక్కోడితే మనం కట్టాలా ? ఆ నష్టం మనం భరించాలా ? అదేమని అడిగితె మాకు నీళ్ళు లేవు పంటలు పండవు. మేము ఎలా కట్టాలి అని ఎదురు ప్రశ్న ఒక్కటి వెటకారంగా

హైదరాబాదులో అందరూ పెట్టుబడులు పెట్టారు. హైదరాబాదు ని అభివృద్ధి చేసారు. కేంద్రం కూడా పెట్టుబడులు పెట్టింది
మనం tax లు కట్టిన సొమ్ము హైదరాబాదులో పెడ్తే ఎలా ?

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అయిదవ స్తానాన్ని సంపాదించుకుంది. హైదరాబాద్ ఒక్కటే అభివృద్ధి చెందింది.
అందుకే ఇక్కడ జనాభా ఎక్కువ . ఇక్కడ కాలుష్యం ఎక్కువ . ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్ళాలన్న గంట సేపు పడుతుంది
బైకు మీద హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే తెలుస్తుంది ఎంత కాలుష్యమో

అందుకే ముక్కలు చెక్కలు చేయాలి.
హైదర్ అలీ బాదు ని కాలుష్యాలనుంచీ, శబ్దాలనుంచీ విముక్తి కల్పిద్దాం .
మన ప్రాంతాలను అభి వృద్ధి చేసుకుందాం
సమైక్యంద్ర ఎందుకు ?
అధికార వికేంద్రీకరణ కావాలి.
అవసరం అయితే ఆంధ్ర ప్రదేశ్ ని 23 రాష్ట్రాలు గా చెయ్యాలి. మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాం
మా కృష్ణా జిల్లాని మేమే పరిపాలించుకుంటాం.
మేము ఆస్తి పన్నులు ఎగ్గోట్టము, కరెంటు బిల్లులు కడతాము. చాలా ప్రాంతాల ప్రజలు అస్సలు కట్టరు. అధికారులు వస్తే కొడతారు కూడా
అంటే వాళ్ళ కరెంటు బిల్లులు కూడా మేమే కడుతున్నాం అన్న మాట
అంటే మమ్మల్నే వాళ్ళు దోచుకుంటున్నారు అన్న మాట
నాకు వద్దు వెనక పడిన ప్రాంతాలతో సమైక్య వాదం.
సమైక్య వాదులూ ఆలోచించండి ఒక్క సారి
తాగు బోతుల గణాంకాలు, వ్యవసాయ గణాంకాలు , వంద అబద్ధాలు అన్నీ ప్రక్కన పెట్టాలి
తెలంగాణా వాదులు ఆలోచిన్చినట్లుగా స్వార్ధం గా ఆలోచించాలి
చాలా చోట్ల పదవ తరగతి వరకే చదువుతారు, మరి కోస్తా జిల్లాల వాళ్ళు 25 ఏళ్ళ వరకూ చదువు తారు
చదువుని బట్టి అభివృద్ధి
నేను కష్ట పడి చదువు కున్నాను అభివృద్ధి చెందాను , కనుక వెనక పడిన వాడితో సమైక్య మెందుకు? అని అనుకోవాలి చదువరులు.
సమైక్య వాదం చేసేటట్లైతే జిల్లాలు మండలాలు లెక్కన విభాజిన్చడమెందుకు? అది పరిపాలనా సౌలభ్యం కొరకే కదా మరి :)
నామాట సూటిగా :- ఆంధ్ర ప్రదేశ్ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు. అభివృద్ధి ఒక్క చోటే జరగ కూడదు.

1 comment:

Anonymous said...

then what about the water ur using from the dam which are constructed from the public money of AP...and do u know that the water what ur using from canals will cost government around 4000rs per acre..are the people of costa andhra paying..

second thing : do u know how much it will cost to dig a bore well around 200feets.....and the cost of the motor the farmer uses ......

for ur info the differences are not in between the people of the regions no one is against the people of the other region. just they asked to implement the rules or the gentleman agreement which was signed at the time of merger..

for ur information iam from telangana but i spent my or studied in tenali..
so i know the both regions better and history better .. so please get the real information before u comment

Search