TAMA Rachabanda

TamaRachaBanda for Transparency, Accountability, Measurability and Accuracy

February 10, 2010

ఆంధ్రా ప్రజలు మమ్ములను దోచుకుతింటున్నారు

ప్రత్యెక తెలంగాణా వాదులు మొదట ఆరోపించేదే ఇది. ఆంధ్రా ప్రజలు మమ్ములను దోచుకుతింటున్నారు అని.

ఇది ఎంత వరకూ నిజం ?

మొదటి నుంచీ తెలంగాణా నిజం పాలనలో ఉంది. పి.వి.నరసింహారావు తన "థ ఇన్ సైడర్ " లో నిజం పాలన గురించి వ్రాసారు. "తెలంగాణా ప్రజల తెలివి తేటలు వికసించకుండా చేసాడు నిజాం" అని.
ఆ తర్వాత కర్నూలు ని రాజధానిగా వదులుకుని ఆంధ్రా ప్రజలు, హైదరాబాదుని రాజధానిగా చేసుకుని హైదరాబాదుని అభివృద్ధి చేసారు.

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఇండియా వచ్చినప్పుడు డైరెక్ట్ గా హైదరాబాదు లో దిగాడంతే అర్ధం చేసుకోవచ్చు హైదరాబాదు ఎంత అభివృద్ధి అయ్యిందో అని.

ఇప్పుడు ఆంధ్రా ప్రజలు బాధ పడుతున్నారు అప్పుడు కర్నూలుని రాజధానిగా చేసుకున్నా బాగుండేదని.
కానీ తెలంగాణా ప్రజలు " ఆంధ్రా వాళ్ళు మమ్ములను దోచుకుని తింటున్నారు " అని ఆరోపిస్తున్నారు . ఇది ఎంత వరకూ సమంజసం. ?

హైదరాబాదులో ఆంధ్రులు ఒక్కరే పరాయి వారు కాదు దాదాపు అన్నీ రాష్ట్రాల ప్రజలు ఉన్నారిక్కడ. వాళ్ళందరూ దోచుకోవడం లేదా ?
రాజస్తాన్ నుంచీ, గుజరాత్ నుంచీ మార్వాడీలు దాదాపు దేశం లోని అన్నీ పట్టణాలలోనూ విస్తరించారు. వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకున్నారు. అంటే వారు దోచుకుని తిన్నాట్టా ?

తెలంగాణా ప్రజలకు నేను చెప్పేది ఏమిటంటే ....
>>ఆంధ్రా ప్రజలు దోచుకు తింటున్నారు అని అంటున్నారు కదా , ఎలా దోచుకున్నారు ?
దొంగ తనాలు చేసారా ? మోసాలు చేసారా ?

>> తెలంగాణా వెనకబడటానికి కారణం రాజకీయ నాయకులు,
ముందు వారిని చెప్పు తీసుకుని కొట్టండి.
రోడ్లు, త్రాగు నీటి వసతులు, బ్లా..బ్లా ..సౌకర్యాలు కల్పించని రాజకీయనయకులది తప్పు.
ప్రత్యెక తెలంగాణా కోసం ఇంత గోల చేసే బదులు ఒక్క రాజకీయ నాయకుడిని నిలదీసి ఉంటే అందరు రాజకీయ నాయకులు భయపడే వారు.

తెలంగాణాకి ఆంధ్రా వారి వలన అన్యాయం జరుగుతుందని మోతుకుంతున్నారు దార్ల వారు. వీరు కూడా ఆంధ్రా నుంచి వచ్చిన వారె .
"ఆంధ్రాప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉద్యమంలో భాగస్వాములు కావాలంటే తెలంగాణా ప్రాంతానికి ఏ ఆంధ్రావాళ్ళ వల్ల అన్యాయం జరుగుతుందో, ఒకవేళ ప్రత్యేక తెలంగాణ వస్తే అందరినీ పంపేస్తారా? లేక పోతే పొట్టకూటికోసం వచ్చిన వాళ్ళనీ తరిమేస్తారా? అనే విషయాలపై ఉద్యమకారులు స్పష్టంగా వివరిస్తే, అప్పుడు తెలంగాణా లో స్థిరపడిన ఆంధ్రాప్రాంతప్రజలు కూడా ఉద్యమానికి మరింత మద్దతునిస్తారని దార్ల సూచించారు." అని దార్ల వారు సెలవిచ్చారు.

వీరు కూడా ఆంధ్రా నుంచీ వచ్చారు. వచ్చి 15 ఏళ్ళు అయ్యింది.

ప్రత్యెక తెలంగాణా వస్తే అందరినీ పంపిస్తారా ? లేక పోతే పొట్టకూటికోసం వచ్చిన వాళ్ళనీ తరిమేస్తారా? అని ఉద్యమ కారులు నిర్ణయిస్తారట.

ఇహ నుంచీ హైదరాబాదులో ఉండాలంటే వీసా ఉండాలేమో.

అసలు ఈ స్వతంత్ర భారత దేశం లో ఒకడిని ఉండమనటానికి పొమ్మనటానికి వీళ్ళ కేమిటి అధికారం ?
విదేశీయుల శరణార్ధులను మనం మన దేశం లోకి అనుమతిస్తామే . మరి వీళ్ళు ఎవరండీ ఉండమనటానికి పోమ్మనడానికి ?

1 comment:

Anonymous said...

అన్న ఎందుకే దిల్ పే తీసుకున్టావ్, పరేషాన్ ఐతావ్ . ఇన్ని సంవత్త్సరాల్లో ఎందుకు తెలంగాన రాలేదంటావె? మన ముందు తరాలవాళ్ళు హోవ్లేగాల్లు అంటావా?

తెలంగాణా రాకుండా ఉండనికి వెఇ లొసుగులు ఉన్నాయ్. కొంతమంది హోవ్లేగాల్లు అడగంగానే అది రాదు?

నువ్వు దిగాల్ పడకు . మంచిగా కళ్ళు కొట్టి పండుకో అంత అవే సెట్ఐపోతై.

Search