TAMA Rachabanda

TamaRachaBanda for Transparency, Accountability, Measurability and Accuracy

February 10, 2010

జై తెలంగాణా ! ఓం ప్రధమం గా

మతం అంటే ఏమిటి ?
మతం అంటే అభిప్రాయం లేక అభిప్రాయాల సముదాయము.

నేను నా అభిప్రాయాలన్నిటినీ మార్చుకుంటున్నాను. ఇది తప్పు కాదు. చాలా మంది దుష్ట రాజకీయ నాయకులు మతం మార్చుకున్నారు ఓట్ల కోసం మరియు నోట్ల కోసం . వారి ముందు నేనెంత?

అందుకని నేను తెలంగాణా కోసం తీవ్రం గా వాదిస్తా ! అలాగని నన్ను తెలంగాణా తీవ్ర వాది అని ముద్ర వేయవద్దు.
తెలంగాణా కోసం ఊగ్రంగా వాదిస్తా ! నన్ను తెలంగాణా ఊగ్ర వాది అని పిలవొద్దు.

అలాగనే తెలంగాణా వాదిని అన్నాను కదా అని...

ఆంధ్రా వాళ్ళ ఆస్తులు తగల పెట్టడానికి పిలవొద్దు.
బంద్ లకు , రాస్తారోకోలకు రమ్మని అనవద్దు
బస్సులను నాశనం చేయడానికి కబురు పంపొద్దు దయ చేసి .

ఒకడు, ఒకసారి మోస పొతే అయ్యో అంటాం.
రెండో సారీ మోస పొతే అమాయకుడు అంటాం
మూడోసారి మోసపోతే పిచ్చోడు అంటాం
నాల్గోసారి మోసపోతే వేర్ర్రోడు అంటాం

పాపం తెలంగాణా ప్రజలు ఒకసారి కాదు రెండోసారి కాదు మూడు నాలుగు అయిదు కానేకాదు 55 ఏళ్ళగా మోస పోతూనే ఉన్నారు. అది ఆంధ్రా వల్ల తెలివి తేటలా లేక నా తెలంగాణా ప్రజల అమాయకత్వమా ?

తెలంగాణా ప్రజలను మోసం చేసే వారి ఆగడాలు ఇక చెల్లవ్. ఆ అమాయకులకి తోడు నేన్నున్నాను.!!

నా తెలంగాణా వారికోసం నేను సైతం అనే లెవెల్లో బ్లాగ్లు వ్రాస్తా.

నేను ప్రత్యేక తెలంగాణా కోసం 80యేళ్ళయినా పోరాడుతూనే ఉంటా!!
నా పిల్లల చేత కూడా ప్రత్యేక తెలంగాణా ఉద్యమానిని చేయిస్తా
అప్పటికీ తెలంగాణా రాకపోతే మనవలతో కూడా నడిపిస్తా ఉద్యమానిని.

ఆంధ్రా రాజకీయ నాయకులారా ! వీరిని అమాయకులను చేసి మోసం చెయ్యటం భావ్యం కాదు :)

జై తెలంగాణా అని పోస్టర్లు అంటిస్తా !

వెనకా ముందూ కూడా .... కారుకి,
పైనా , కింద కూడా .... ఇంటికి,
మూతి కొకటి .... ముక్కుకి ఒకటి పోస్టర్లు అంటిస్తా !!

నేను తెలంగాన మతం తీసుకున్నని చాటి చెపుతా !

ఎందుకంటే
నా కుటుంబ సబ్యులకు హాని జరగకుండా
నా ఆస్తులను ద్వంసం చెయ్యకుండా
నేను ప్రశాంతం గా ఉండటానికి
నా బ్లాగ్ లోకి తీవ్ర వాదులు రాకుండా ఉండటానికి,

ఇంకొక కారణం కూడా ఉంది
తెలంగాణా బందు రోజు ఏమి జరిగిందంటే ?

మా తెలంగాణా యజమాని ,
తెలంగాణా లో రిజిస్టరు అయిన కారుని,
తెలంగాణా డ్రైవరు ని ఇచ్చిపంపించాడు.
తెలంగాణా సేవకుడు టిఫిన్స్ తెచిపెట్టాడు.
మధ్యానం భోజనం కూడా,
సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ కారులో నే వచ్చాను.

ఆ రోజు నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో తెలంగాణా ప్రజలు,
ఇక్కడ గమనిచ వలిసిందేమిటంటే వారెవ్వరూ తెలంగాణా ఉద్యమం లో పాల్గొనలేదు. విధి నిర్వహణ లో నిమగ్న మయ్యారు. ఎవరి పని పాట వారు చూసుకున్నారు. కొంత మందితక్క.
కేవలం నాకు ప్రాణ రక్షణ కల్పించడానికి, వారు వారి జీవితాశాయ మైన తెలంగాణా ని త్యాగం చేసారు.
అందుకనే నేను తెలగాణ మతము ను స్వీకరిస్తాను.

రేపు ఉదయం రాహుకాలం లో ( నాకంత గా రాహుకాల పట్టింపులు లేవులేండి ఈ విషయం లో మాత్రం) మన కెసిఆర్ గారి దగ్గరకో, వారి చెల్లెలి దగ్గరకో , వారి కొడుకు దగ్గరకో, కూతురి దగ్గరికో , లేక పొతే మేనల్లుడు దగరకో వెళ్లి పింకు జండా మెళ్ళో వేయించుకుంటా !

గత తొమ్మిది సంవత్సరాలుగా నా తెలంగాణా ప్రజలకు జరుగుతున్న అన్యాయాలకి సాక్షి లా మౌనంగా భరించిన కెసిఆర్ అంటే నాకు అభిమానం.

తెలంగాణా మతం స్వీకరించిన తర్వాత నేను ప్రశాంతం గా పండుగకి ఊరువెల్లి ఎంచక్కా అందరినీ కలువ వచ్చు.

తెలంగాణా మతం తీసుకోవడం వల్ల లాభాలు :-

1 శాంతి భద్రతలు తద్వారా ప్రశాంత వాతావరణం,
2 నా కుటుంబ సభ్యులకు భద్రత,
3.నా ఆస్తులకు రక్షణ,
4.రియల్ ఎస్టేటు కుప్పకూలడం వల్ల ఆస్తులు కూడ పెట్టు కోవచ్చు,
5 బ్లాగ్ లోకంలో మరియు
బాహ్య లోకం లో దాడులు జరగవు
6. బ్లా బ్లా బ్లా అన్నీ లాభాలే

తెలంగాణా మతం తీసుకోవడం వల్ల నష్టాలు :-
1.ఒక్క నష్టం కూడా లేదు

తెలంగాణా మతం తీసుకోవడం వల్ల భయాలు:-
1. సొంత ఊరు వెళితే కొడతారు

@ తెలంగాణా మిత్రులకి : ఇందు మూలముగా నేను తెలియ చేయినది ఏమనగా నేను తెలంగాణా వాదిని కావున నా బ్లాగ్ మీదకి దండెత్త వద్దు. ఇకనుంచే మీరు నేను ఫ్రెండ్స్ . మన మద్య విభేదాలు వద్దు. ప్రత్యేక తెలంగాణా వస్తుంది ఇప్పుడు కాకపొతే కొన్ని ఏళ్ళు అయిన తర్వాత. నామీద మాత్రం విరుచుకుని పడకండి.

ఇట్లు
తెలంగాణా కోసం తీవ్రం గా వాదించే /
తెలంగాణా కోసం ఊగ్రం గా వాదించే
అప్పారావు శాస్త్రి.

జై తెలంగాణా ! ( ఆద్యతం జై తెలంగాణా )( మొదట్లో చెప్పా , చివర్లో చెప్పా)

రేపు ఉదయం రాహుకాలం లో జరిగే నా తెలంగాణా మత స్వీకారోస్తవానికి శ్రేయోభిలాషులు, మిత్రులు, మరియు ముష్కర్లు తప్పక విచ్చేయాలని ఈ బ్లాగ్ ముఖం గా సవినయంగా ఆహ్వానిస్తున్నాను.

జై తెలంగాణా! జై జై తెలంగాణా !!
ఎయ్ మళ్ళా

7 comments:

Anonymous said...

baagane mudhiri poindhi.... Inka vishayam chethulu dhaatipoindhi.... Poyyekaalam dhaaggara padindhandi sir meeku...

Better take care of your self or consult a specialist...

Unknown said...

I feel that we are letting our emotions overtake the need for progress a common man is looking for in AP. I am looking for one person that supports separate Telangana state to debate on live TV with a non-separation supporter. If any pro separate state person really cares to help our Telugu people in AP, please consider this offer and email to jaisamaikyaap@gmail.com

I think it is time we take more responsibility in what we say and see how we can really contribute to the harmony of all Telugu people and our beloved Telugu state. Let us not fight within ourselves and not help our neighboring states take advantage of the situation and grab all the projects that otherwise we could have got.

Anonymous said...

Telangana is a big joke and you have just become a big joker.
Congratulations.

Unknown said...

If that is a joke, how did it make the progress of AP/Hyderabad go backwards by about 10 years? How did it make the other cities/states (Maharashtra, Tamilnadu, Karnataka) gain our projects? Does it look like a joke to you?

Anonymous said...

Yes. Telangana is a big joke.

Telangana never existed or will form now.

Reason: India is a democratic nation. No one can divide it by force. These jokers don't know a thing about democracy.

More seriously you take this joke, more you are going to loose.

So chill, Just humor it.

Unknown said...

Mr.Anonymous,
The discussion is about splitting a state in to two not a Nation. You seems to have no respect of people's opinions or wisdom of current events.

Remember what Srisri said, "Konthamandi Kurravaallu Puttukatho vrudhulu".

Anonymous said...

If you really want Telangana to form, give equal consideration to "respect of people's opinions or wisdom of current events" of all regions.

Otherwise it's just a joke.

Search