TAMA Rachabanda

TamaRachaBanda for Transparency, Accountability, Measurability and Accuracy

December 24, 2009

అమ్మలగన్న యమ్మ....ఇటలీ పెద్దమ్మ

సోనియా గాంధీ గారికి బహిరంగ లేఖ
---- ----- ----- ----- -----

అమ్మలగన్న యమ్మ....ఇటలీ పెద్దమ్మ...భారత భాగ్య విధేత్రి...మహా రాణి
రాణిశ్రీ సోనియా దివ్య సమ్ముఖమునకు...

భవదీయులైన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు విన్నవించునది..

అమ్మా!

మేమంతా మహా పాపులము...తెలిసో తెలియకో ఎన్నెన్నో పాపాలు చేశాము!!!

1.కాంగ్రెస్ అంటే జాతీయ పార్టీ ...వంద యేండ్లకు పైబడిన చరిత్ర కలిగిన
గొప్ప పార్టీ అని గుడ్డి నమ్మకంతో మొన్న 2009 ఎన్నికలలో కేంద్రం లోనూ
రాష్ట్రం లోనూ కాంగ్రెస్ ని గెలిపించాము.

2.దీర్ఘ దృష్టి , సమభావన మెండు గా కలిగిన జన నేత ఐన ముఖ్యమంత్రి స్థాయి
వ్యక్తి భద్రత ని పట్టించుకోలేక నిద్ర పొయే నిఘా వ్యవస్థ లో
జోగుతున్నాము.

3.ఆ తరువాతైనా సమర్థవంతమైన ముఖ్యమంత్రి ని ఎన్నుకోవాలనే కనీస స్పృహ లేని
స్వార్థ రాజకీయ నాయకుల చేతిలో బందీలమైపోయాము.

4.చరిత్ర కనీ వినీ ఎరుగని రీతి లో అత్యంత బలహీనమైన, అసమర్థమైన
ముఖ్యమంత్రి ని మా పైన బలవంతం గా రుద్దితే నోరెత్తకుండా పడి ఉన్నాము.

5.రాష్ట్ర విభజన మీద ఎప్పటినుండో చర్చ జరుగుతున్నా 'ఇది మా సమస్య కాదు
లే' అన్నట్టు ఇన్ని రోజులు పట్టించుకోకుండా నిర్లిప్తం గా బండ రాళ్ల లా
పడి ఉన్నాం.

6.సెలైన్ లూ , టీ.పీ.ఎన్ లూ తీసుకుంటూ ఒకాయన నిరాహార దీక్ష
చేస్తున్నానంటే,దాన్ని మీడియా హైలైట్ చేసి చూపిస్తూ ఉంటే ఆహా..ఓహో అంటూ
వినోదం గా చూశాం.

7.తీర్మానం పెట్టండి ..మేం మద్దతిస్తామని చెప్పి..చివరికి అందరి చెవి లో
పువ్వులు పెట్టే ప్రతిపక్ష నాయకుడిని కలిగిఉన్నాం.

8.గోడ మీద పిల్లుల లాంటి పార్టీల మాటలు నమ్మి ప్రకటన చేసే, 'ఇంటెలిజెన్స్
' ఏమాత్రం లేని కేంద్ర హోం మంత్రి చల్లని పాలన లొ భద్రం గా ఉన్నాం.

9.తీరా ప్రకటన చేసేశాక 'చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్టు గా '
మూకుమ్మడి రాజీనామాలు చేసేసే ప్రజా ప్రతినిధులను ఎన్నుకున్నాం.

10.సామాన్య ప్రజలు, ప్రయాణికులు ఇబ్బంది పడేట్టు గా బస్సులను తగలబెట్టే
దుస్సంస్కృతి లో ఉన్నం.

11. రోజుల తరబడి విద్యా సంస్థలూ, వైద్యాలయాలూ మూసివేసుకుంటూ మా జీవితాలని
మేమే నాశనం చేసుకుంటున్నాం.

ఇన్ని సార్లు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయే మాకు...మమ్మల్ని మేము
పాలించుకునే హక్కు లేదు....

పచ్చని కుటుంబం లో చిచ్చు పెట్టిన మీ చేత్తోనే మా ప్రజాస్వామ్యానికి
కాస్త తల కొరివి పెట్టేసి ,మా హక్కులన్నింటికీ తద్దినం పెట్టేసి మా మీద
ఇంకా చేయాల్సిన ఏకైక ప్రయోగమైన ఆ "రాష్ట్రపతి పాలన " కాస్తా విధించేసి
సంతోషం గా తమాషా చూడవలసింది గా విఙ్ఞప్తి చేస్తున్నాం.....

భవదీయులు
దురదృష్టవంతులైన ఆంధ్ర ప్రదేశ్ ప్రజానీకం
Ravindra Singareddy

4 comments:

RP said...

Nice one Ravi. I think you reflected everyone's feelings in your "letter" to the greatest Amma! Gurava Reddy

Sonia said...

hehehe Rosii gadinii CM chaysaanuu, Jagan gadinii tokkinanu, inkaa mundhu vundii raa musalaa pandagaa. Italy aa mazakaa, meeru yami anukuntunaru raa pedaa pudingulu aa meeru, national politics loo meeru yantaa bay, naakay ultimatum istaaru aa YSR chachinaaka, manta laygusstadii bay.

Anonymous said...

ananda padaknadi....
itta lafangi anandam ponde prathi Galim lotion na kodukulandaru ippudu edustunnaud ....mana assthulaki rakhana leka hyd lo ..
Mana aadangi CBN manaki emi cheyaledu ..Cheyagaliki nodu ei lokam lo ledu ..
anubhavinchandi gajji na jakollara ..

Anonymous said...

jagan ganiki CM raka pote meekundukaura anadam ..
Anubha vistunnaruga ippudu ..
Hyd lo mana aasthulaki rakhana leka. Peddayana chani poinappudu ananda padda Gajji kukka landaru ei vidham ga anubha vinchandi.
Mi aadangi CBN gadu meekemi cheyyeledu ..cheyya galigi noadi ei lokam lo ledu ..
anubhavinchandi galima lotin na jakollara.

Search